Header Banner

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

  Sat Apr 26, 2025 10:10        Politics

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీకి అనుబంధ విభాగమైన ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి రేణుక, ఆమె భర్త నీలకంఠం రూ.310 కోట్లు అప్పు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ లోన్ తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తులను వేలం వేసేందుకు ఎల్‌ఐసీ సిద్దమైంది. ఇప్పటికే రెండు సార్లు వేలం వేయగా.. ఇప్పుడు మూడోసారి కూడా వేలం వేయబోతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ఈ తరహా ఘటనలో ఆమె పేరు వినిపిస్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.


లోన్ వివరాలు..

2018లో 15 ఏళ్ల కాలానికి గాను.. మాజీ ఎంపీ రేణుక, ఆమె భర్త నీలకంఠం కలిసి రూ.310 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యుటెక్ సర్వీసెస్ కార్యకలాపాలకు వినియోగించారు. ఐదేళ్ల క్రితం వరకు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించారు. మొత్తం రూ. 40 కోట్ల వరకు తిరిగి చెల్లించారు. అయితే, ఆ తర్వాతి నుంచి చెల్లింపులు నిలిపివేశారు. అసలు, వడ్డీ కలిపి ఇంకా దాదాపు రూ. 340 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అయితే, వడ్డీ భారం ఎక్కువగా ఉండటంతో కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీ షెడ్యూల్ చేయాలని వారు కోరారు.


ఇది కూడా చదవండి: వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు! స్కూటీ స్వాధీనం! వారిద్దరు నిందితులుగా గుర్తింపు!

 

 

అయితే ఈ ప్రతిపాదన నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో హెచ్ఎఫ్ఎల్ దీనిని అంగీకరించలేదు. అంతే కాకుండా రుణం తీసుకున్న మొత్తానికి నెలసరి వాయిదా రూపంలో రూ. 3.4 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ మొత్తం భారంగా మారడంతో తొలుత తక్కువ మొత్తం తీసుకుని.. చెల్లింపు మొత్తాన్ని క్రమేణా పెంచాలని రేణుక ప్రతిపాదించారు. అందుకు కూడా హెచ్ఎఫ్ఎల్ ఆమోదం తెలుపలేదు. ఈ నేపథ్యంలో వాయిదాల చెల్లింపు నిలిచిపోవడంతో ఎన్‌సీఎల్‌టీని హెచ్ఎఫ్ఎల్ ఆశ్రయించింది.

గతంలో రెండుసార్లు వేలం..

ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉండగా.. లోన్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని 5 వేల గజాల ఆస్తిని రూ.145 కోట్లకు వేలం వేశారు. కానీ ఎవరూ ముందుకు వచ్చి వేలంలో పాల్గొనలేదు. అలానే మాదాపూర్‌లోని 7,205 చదరపు గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్ కూడా వేలం వేయగా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో అధికారులు మరోమారు ఆస్తులను వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

 

 

అర్ధరాత్రి భారత జవాన్లపై పాక్ కాల్పులు! కాశ్మీర్ ఎల్ఓసీ పొడవునా..

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

విశాఖలో వైసీపీకి ఊహించని షాక్! ఒకవైపు అరెస్టుల కలకలం... మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై!

 

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #yscpshock #exmpassets #auctionnews #politicaltwist #apnewsupdate #bigblow